పేజీలు

21, ఏప్రిల్ 2009, మంగళవారం

హ్హ హ్హ హ్హ ... నవ్వండి(4)

రైల్వే కంపార్ట్మెంట్లో ఎదురుగా కూర్చున్న కుర్రవాడు అదే పనిగా చూయింగ్గమ్ నమిలేస్తున్నాడు. ఓ పావుగంట గడిచింది. ఎదురుగా కూర్చున్న బామ్మగారు కుర్రవాడిని చుస్తూ...
ఏన్టోరా అబ్బాయి! ఇందాకట్నించి మాట్లాడుతున్నావ్.... ఒక్క ముక్క వినపడి చావలా... పెద్దదాన్ని కాస్త వినికిడి
తగ్గింది
... పెద్దగా మాట్లాడు తండ్రి......
----------------------------------------------------------------------------

భర్త: - వాహ్ డార్లింగ్......... బంగాళదుంపలు ఒక కేజినే వండినట్లున్నావ్........ రెండు కేజీలు వండితే బాగుండేది.
భార్య: - ఏమిటండి... కూర అంత బాగుందా?
భర్త: - అదేమీ కాదు .. కూరలో నువ్వు వేసిన ఉప్పు రెండు కేజిలకి ఖచ్చితంగా సరిపోయేది అందుకని......
-------------------------------------------------------------------------------

" ఏమొయ్ నువ్వు రోజుకి ఎన్నిసార్లు గడ్డం చేస్తావ్?"
"ముప్పయ్, నలభయ్ సార్లు."
"వామ్మో! అన్ని సార్లా నీకేమైనా పిచ్చా?"
"పిచ్చికాదు, వెర్రికాదు నాకు సెలూన్ ఉంది."
-----------------------------------------------------------------------------
కస్టమర్: కట్టింగ్ ఎంతండి? ...
బార్బర్: పది రూపాయలూ...
కస్టమర్: షేవింగు ...?
బార్బర్: ఐదు రూపాయలు....
కస్టమర్: అయితే నా తలకి షేవింగ్ చేయండి.

20, ఏప్రిల్ 2009, సోమవారం

మనో వికాసం

ప్రతి మనిషి ముందుగా తనను తాను తెలుసుకోవాలి. తనలో తనకే ఘర్షణ, తనకు ఏమి కావాలో తనకే తెలియని పరిస్థితులు, మోయలేని భారాలు, భరించలేని భాదలు మనిషిని క్రుంగదీస్తాయి. సాధించినదానితో త్రుప్తిని పొందక సాధించలేని దానికోసం పరుగులాటలో , విలాసవంతమైన జీవితం కొరకు ఎదుటివారిని బాధపెడుతూ దురవస్తలపాలు అవుతున్నాడు.
చుట్టూ ఉన్నవారితో పోటి పడుతూ, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలని ఆరాతపడుతు ఉండేవారికి క్షణం తీరికవుండదు. శాంతంగా బ్రతకడం కన్నా సుఖం మరేది లేదు. కాసింత దయ, ప్రేమ, జాలి ఉండడమే మనిషికి ముఖ్యం. అర్థంలేని ఆరాటాన్ని వదిలి ప్రశాంతంగా జీవించాలి.

18, ఏప్రిల్ 2009, శనివారం

ఆలోచనలు

మనిషికి ఆలోచనలు ఎప్పటికప్పుడు మాయమై కొత్తవి పుడుతూనే వుంటాయి. వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోగలిగినప్పుడే కొంత కాలం తరువాత వాటిని వినియోగించుకోగల అవకాశాలు లభిస్తాయి. అలాకాకుండా అవి ఆలోచనలుగానే మిగిలిపోతే ఏమి ప్రయోజనం ఉండదు.

14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం అభివృద్ధికి తొలిమెట్టు, వోటమికి క్రుంగిపోకుండా కారణాలు అన్వేషించు,
వోటమి తరువాత వచ్చే విజయం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.

మంచి

తెలుసుకున్నకొద్దీ తెలియవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి.
అందరిలోనూ మంచిని చూడు సాధ్యమైనంతవరకు ఆచరించు.

11, ఏప్రిల్ 2009, శనివారం

ప్రార్థించు

ప్రార్థించు కాని ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో ఎందుకంటే
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న.

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

అమృత గుళికలు

ఆదర్శం కన్నా ధర్మం గొప్పది , ఆయుధాలకంటే ఆత్మశక్తి గొప్పది , రాక్షతత్వం కన్నా మానవత్వం గొప్పది.

9, ఏప్రిల్ 2009, గురువారం

స్నేహం

జీవితంలో మంచి స్నేహితులు నలుగురైనా ఉండాలి. వందల కొద్ది స్నేహితులున్నా ఉపయోగంలేదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా మిమ్మల్ని వదిలి వెళ్ళినా మీతో ఉండేవారే నిజమైన స్నేహితులు.

8, ఏప్రిల్ 2009, బుధవారం

అమృత గుళికలు

అన్నదానం , నీళ్ళదానం ,డబ్బుదానం , బట్టదానం తాత్కాలికమే విద్యాదానం చాలా గొప్పది. జీవితానికి ఆధారం కల్పిస్తుంది.

అమృత గుళికలు

మాట్లాడేముందు శ్రద్దగా విను , వ్రాసే ముందు బాగా ఆలోచించు , ఖర్చు పెట్టే ముందు బాగా సంపాదించు , పెట్టుబడి పెట్టేముందు నిదానించు, ప్రార్థించేముందు క్షమించడం నేర్చుకో, ఆశ వదులుకునే ముందు గట్టిగ ప్రయత్నించు , మృత్యువుకు ముందు దానధర్మాలు చెయ్యు .
కాస్త చీకటి ఉండగానే లేచి ప్రాణాయామం చేస్తే ఏ జబ్బులు రావు

అమృత గుళికలు

జీవితంలొ గడచిన ఆనంద క్షణాలని అప్పుడప్పుడు ఙాపకం చేసుకుంటుండాలి

శ్లోకం

శుక్లాం బరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే