పేజీలు

28, అక్టోబర్ 2010, గురువారం

ఆర్య 2 ( టైటిల్ పేరడీ సాంగు)

 టిప్ టాప్ హీరో కదిలిండో... 


ఎవడికి వీడు హిట్టు ఇవ్వడండో..

ముదురండో.... బలుపండో...

సినిమా తీయకండో...

ఉప్పు కప్పురంబు ఒక్క లుక్కు నుండో...

వీడి మూవి చూసి మోసపోకండో....

ఫ్లాప్ అండో..... వేస్టండో...

ఓవర్ యాక్షనండో...

కమాన్ కమాన్... మోస్టు బోరింగు..

కమాన్ కమాన్... మస్తు లాఫింగు..

కమాన్ కమాన్.. వరష్టు యాక్టింగు...

హే యాయి యేహియో.

మిస్టెర్ ఫ్లాపర్ ఫ్లాపర్ .. హి ఈజ్ మిస్టెర్ ఫ్లాపర్

లెన్స్ వేసి వెతుకు.. దొరకదు రా ఏ హిట్టు.

ఆహ్.. వీడో జఫ్ఫా యాక్టర్,

ఈ మాటర్ అందరికీ తెలుసు,

వీడి మూవి తీసి తీసి ఆస్తులన్నీ కరిగిపోయినాయ్

కాని ఎవడూ మానడు.

పైగ ఈ రొజుల్లో ఇలాంటోల్లకు ఎర్రి ఫాన్సు బాగా ఎక్కువా...

ఐనా ఇంకో సారి ట్రై చేస్తా... హుస్సెన్ సాగర్ లో తోసేస్తా..

నాతో బాస్కెట్ బాల్ ఆడగలరా!..

5, అక్టోబర్ 2010, మంగళవారం

రామారావు పేకాటలో నిండా మునిగిపోయాడు. రాత్రిలేదు పగలు లేదు... భార్యాపిల్లల పట్టింపు లేదు. పరిస్థితి చేయిదాటిందని వాళ్ళావిడ తన సోదరుడికి కబురు పెట్టి పిలిపించింది. 
బావమరిది: చూడు భావా.... పేకాటలో డబ్బులు ఇవ్వాల వస్తాయి. రేపు పోతాయి ఎల్లుండి వస్తే, అవతలెల్లుండి మళ్లీ పోతాయి. ఇది మాయదారి ఆట.... అని తన బావ రామారావుకు నెమ్మదిగా చెబుతున్నాడు.
రామారావు: సర్లే యింతకి నువ్వు చెప్పేదేమిటి.... రోజు విడిచి రోజు ఆడమంటావు....అంతేగా!

ఫోన్‌ బిల్‌ చూసి బిత్తరపోయిన రామరాజు ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరు ఇన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు.
కొడుకునేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌ గారి అకౌంట్లోనే!
పనిమనిషి: మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేసుకుంటున్నారు కదాని నేను ఈ ఫోన్‌ వాడుతున్నాను.
మరి నాకు ఆఫీస్‌ అంటే మీ ఇల్లే కదా!
                                           
భార్య : చూశారా! నాఉపవాసాల ఫలితం! ఈ నెల బియ్యం ఖర్చు రెండువందల రూపాయలు మిగిలింది.
భర్త : అవుననుకో! కాని.. పళ్ళషాపు వాడికి మాత్రమే ఇంకా వెయ్యి రూపాయలు బాకీఇవ్వాల్సి ఉంది.

రమేష్: "రాధా రాధా.... బుజ్జిపండు మాటలు విన్నావా?చూడు రెండేళ్ళకే ఎంత చక్కగామాట్లాడుతున్నాడో! నాతెలివితేటలన్నీ వీడికి వచ్చాయి"సంతోషంగా అన్నాడు.
రాధ: "అవును నిజమే. నాతెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి"అన్నది.