గురు సందేశం
ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యునితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలో నున్న నాలుగు మొక్కలను అతను గమనించాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్ని మొక్క, రెండవది కొంచం పెద్ద మొక్క, మూడవది దానికన్నా పెద్దది, నాల్గవది చాలా పెద్ద చెట్టు.
గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దాన్ని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. గురువుగారు రెండో మొక్కను కుడా లాగేయమన్నాడు. శిష్యుడు కొద్దిగా కష్టపడి దానిని లాగేశాడు. ముడవదానిని కూడా లాగామన్నాడు. శిష్యుడు తన శక్తినంతా ఉపయోగించి కష్టంగా దాన్ని లాగేశాడు. అప్పుడు బాగా ఎదిగిన నాల్గవ చెట్టును చూపుతూ దాన్ని లాగడానికి ప్రయత్నించమన్నాడు. శిష్యుడు ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేక పోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న కుర్రాడితో గురువు ఇలా అన్నాడు. "చూడు నాయనా! మన అలవాట్ల విషయంలో కుడా ఇంతే. చెడు అలవాట్లు పాత బడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నది సామెత. ఈ విధంగానే ఎంత ప్రయత్నిచినా చెడు అలవాట్లు మార్చుకోలేము, కనుక చెడు అలవాట్లు మొదలైనప్పుడే వాటిని మార్చుకోవాలి. మంచి అలవాట్లని నేర్చుకోవాలి.
30, జులై 2009, గురువారం
గర్వము పనికి రాదు
మన వద్ద ధనము ఉందని ఎదుటివారిని కించపరచ కూడదు. తనకి తాను గర్వపడకూడదు. నేనే ధనవంతుడినని మీరు అనుకుంటే మీ కంటే ఎక్కువ ధనవంతులు, గొప్పవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. సాయంకాలం వేళ మిణుగురు పురుగులు బయటకు వచ్చి మేమే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నామని భావిస్తాయి. కాని నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మిణుగురు పురుగుల గర్వం పటా పంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగు నిస్తున్నామని అనుకుంటాయి. కాని చంద్రోదయంతో తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తనవల్లే ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నానని భావిస్తాడు. ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయ వెలుగులో చంద్రుడు ఉన్నచోటు తెలియకుండా పోతాడు. గొప్పవాళ్ళని మించిన గొప్పవాళ్ళు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. అందుకే మేమే గొప్పవాళ్ళమని ఎప్పుడు అనుకోవద్దు.
14, జులై 2009, మంగళవారం
అమ్మ ప్రేమ (కవిత)
అమ్మ! అన్నది ఒక చల్లని మాట,
అమ్మ మనసు వెన్నముద్ద
నులివెచ్చని ఒడిలో గోరువెచ్చని ముద్దను
లాలించి, ఊరించి కొసరి కొసరి తినిపిస్తూ
కడుపును చల్లగా చేస్తుంది అమ్మ
ఒంట్లో కాస్తంత చల్లగా ఉందంటే
ఎంతో గాబరైపోతుంది అమ్మ, గుండె గాయం చేసుకుని
కంటిపాపకు కునుకు రానీయదు అమ్మ
ఘడియైనా విడిచిపెట్టక సేవచేస్తుంది అమ్మ
తడబడే మనసుతో తల్లడిల్లుతుంది అమ్మ
ఏ నిమిషానికి ఏమి కావాలో ఏ ఘడియలో ఏం చేయాలో
ఏ పూటకు ఏమి పెట్టాలో అమ్మకు తెలిసినంత మరి యెవ్వరికి తెలుస్తుంది
షరతులు లేనిది అమ్మ ప్రేమ! ప్రతిఫలాన్ని ఆశించదు అమ్మ
అమ్మ తప్ప ఎవరు చూపుతారు ఈ ప్రేమని లోకంలో.
అమ్మ మనసు వెన్నముద్ద
నులివెచ్చని ఒడిలో గోరువెచ్చని ముద్దను
లాలించి, ఊరించి కొసరి కొసరి తినిపిస్తూ
కడుపును చల్లగా చేస్తుంది అమ్మ
ఒంట్లో కాస్తంత చల్లగా ఉందంటే
ఎంతో గాబరైపోతుంది అమ్మ, గుండె గాయం చేసుకుని
కంటిపాపకు కునుకు రానీయదు అమ్మ
ఘడియైనా విడిచిపెట్టక సేవచేస్తుంది అమ్మ
తడబడే మనసుతో తల్లడిల్లుతుంది అమ్మ
ఏ నిమిషానికి ఏమి కావాలో ఏ ఘడియలో ఏం చేయాలో
ఏ పూటకు ఏమి పెట్టాలో అమ్మకు తెలిసినంత మరి యెవ్వరికి తెలుస్తుంది
షరతులు లేనిది అమ్మ ప్రేమ! ప్రతిఫలాన్ని ఆశించదు అమ్మ
అమ్మ తప్ప ఎవరు చూపుతారు ఈ ప్రేమని లోకంలో.
6, జులై 2009, సోమవారం
కోపము - క్షమ
ప్రతీ మనిషిలో ఎంతో కొంత కోపము ఉంటుంది. లోపలెక్కడో దాగి ఉన్న అహము కోపము రూపంలో బుస్సుమని బయటకు వస్తుంది. మనకు చేటు కలిగించే కోపాన్ని తగ్గించుకోవాలి. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనము క్షమాగుణము కలిగిఉంటే మనచుట్టూ ఉన్నవాళ్ళు అందరు మంచిగా కనిపిస్తారు. మనిషికి క్షమాగుణాన్ని మించిన సుగుణము మరియొకటి లేదు. అనాది కాలము నుండి సాధువులు, సత్పురుషులు క్షమే రక్ష అని ఎన్నో విధాలుగా మనకు తెలియచేస్తూనే ఉన్నారు. దీన్ని సుమతి శతకములో మనసుకి హత్తుకునేలా వివరించారు......
"తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
తన సంతోషమే తన స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి!"
"తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
తన సంతోషమే తన స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి!"
కోపము మనకు శత్రువు. క్షమాగుణము కలిగినవాళ్ళు అదృష్టవంతులు , ఓర్పు లేనప్పుడు ఎంత చేసినా ప్రయోజనము ఉండదు. మనలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కొందరి మాటలు, చేష్టలు అలాంటి సందర్భము ఏర్పడినప్పుడు మనము నిగ్రహంగా ఉండాలి. ఎదుటివాళ్ళను క్షమించడమంటే అది మన మనసుపై మనము సాధించిన విజయము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)