పేజీలు

12, జూన్ 2009, శుక్రవారం

సూక్తి ముక్తావళి (సేకరణ)

* కాలాన్ని మించిన బోధకుడు లేడు.
*ఎముకలు విరిగేటట్లు పనిచేస్తే దంతాలు విరిగేటట్లు తినచ్చు.
*నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కాని ఆ కారణం తోనే ఇతరులకు హాని చేయవద్దు.
*కష్టాలు బలహీనున్ని పడగొడతాయి, బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి.
*తెలుసుకోవాలనే కోరిక విషయాలను శోధించడానికి పురిగొల్పుతుంది.
*ఎవరూ తప్పులెన్నలేని విధంగా చేసి చూపాలని అనుకునే వారు ఎప్పటికీ ఏ పని చేయలేరు.
*అలవాటు ఇనుప చొక్కా లాంటిది, వదిలించుకోవడం కష్టం.
*అపారంగా ఇవ్వడం కాదు, అవసరాన్ని బట్టి ఇవ్వడమే ఔదార్యం.
*విద్య మనిషి నుంచి వేరుచేయలేని సంపద.
*గడచిన ప్రతిరోజు మనమేదైనా నేర్చుకొనేదిగా ఉండాలి.
*కృషి అనే ద్వారాన్ని తెరువకపోతే అదృష్టం అదృశ్యమవుతుంది.
*మనం చేసే ప్రతీ పనికి ఒక నియమంఉండి తీరాలి.
*పఠనం వల్ల మానవుడు పరిపూర్ణుడు అవుతాడు.
*మంచిగా జీవించు, మంచిని పెంచు, నీ మంచిని నలుగురికి పంచు, భవిష్యత్తులో ఆ మంచే నిన్ను కాపాడుతుంది.