పేజీలు

27, అక్టోబర్ 2009, మంగళవారం

కన్జూస్ జోకులు

కన్జూస్:  ఈ అరటిపండు ఎంత?
షాపువాడు: 1 రూ.
కన్జూస్:   60 పైసలకి ఇస్తావా.
షాపువాడు:  60 పైసలకి తొక్క మాత్రమే వస్తుంది.
కన్జూస్:  ఇదిగో 40 పై. తొక్క ఉంచుకొని పండు మాత్రమే ఇవ్వు.

--------------------------------------------------------------------

కన్జూస్ మరణించే సమయము.
కన్జూస్ భార్యను ఉద్దేశించి : ఎక్కడున్నావు?
కన్జూస్ భార్య : ఇక్కడే ఉన్నానండి.
కన్జూస్ : పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా?
భార్య: అవునండి ఇక్కడే ఉన్నారు.
కన్జూస్: మరైతే పక్క గదిలో ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది?

--------------------------------------------------------------

ఒకసారి కన్జూస్ ఒక అరబి అతనికి రక్తం ఇచ్చి బతికించాడు.
అరబి కన్జూస్ కి  మెర్సిడిస్ బహుమతిగా ఇచ్చాడు.
మళ్లీ ఒకసారి కన్జూస్ అరబికి రక్తం ఇవ్వాల్సి వచ్చింది.
ఈ సారి అరబి అతనికి లడ్డు బహుమతిగా ఇచ్చాడు.
కన్జూస్ అడిగాడు కోపంతో : మెర్సిడెస్ ఎందుకు ఇవ్వలేదు?
అరబి: మున్నా! ఇప్పుడు నాలో కూడా కన్జూస్ రక్తమే కదా ఉంది అందుకే.

-----------------------------------------------------------------------------

20, అక్టోబర్ 2009, మంగళవారం

మహాత్ముల సూక్తి రత్నావళి.

ప్రపంచంలో ఎన్నో విధాలైన యుద్ధాలుంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది.........స్వామి శివానందుడు.

వైరం అంతమయ్యేది మృత్యువు తోనే..........వాల్మీకి.

తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టి లోనే లేదు.......వాల్మీకి.

సంతృప్తి  అనే వంతెన విరిగి పోయిందంటే, ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు, ఆపూ వుండవు........ప్రేంచంద్.

మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా, వారి గురుంచి పూర్తిగా తెలిసేదాకా, ప్రజలు వారు చెప్పేది ఒక్క ముక్కైనా వినరు......వినోభాభావే.

కోపం యమధర్మరాజు లాంటిది, తృష్ణ వైతరిణి లాంటిది, విద్య కామధేనువు లాంటిది. ఇక, సంతృప్తి దేవరాజైన ఇంద్రుని నందనవనం లాంటిది........చాణక్యుడు.