పేజీలు

1, ఫిబ్రవరి 2010, సోమవారం

అతడే జంబులింగం

మేష్టారు:     ఒరే! కొన్ని సాదు జంతువుల పేర్లు చెప్పరా?
జ.లి.:      మేష్టారు సాదు జంతువులంటే ఏంటండి?
మే.:       నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా?
జం.లి.:     తెలియదండి.
మే.:       మీ ఇంట్లో జంతువులేమి లేవా?
జం.లి.:     లేకేమండి, పిల్లి, ఎలుక, కుక్క.
మే.:       ఆగు,ఆగు వెధవ దండకం నువ్వూను, మీ ఇంట్లో
           ఆవు,గేదె,మేక లాంటి జంతువులను ఎప్పుడూ
           చూడలేదురా?
జం.లి. :    చూడకేమండి!
మే. :      మరి అవి సాదు జంతువులే కదా! అంటే
           మనకేమి హాని చెయ్యనివి అని!...
           అర్థం అయిందా?
జం.లి.    మొన్న గేదె మా బావని పొడవ బోయిందండి.
మే. :     లాభం లేదురా.... అసలు నీతో ... సరే !
          ఆవు సాదు జంతువని తెలుసుకో....
జం.లి.    సరేనండి..
మే.:     ఆవు హిందువులకు  పవిత్రమైన జంతువు.
          ఆవు  పాలు ఇస్తుంది. ఆవు పాలు ఎంతో
          ఆరోగ్యకరమైనవి.
జం.లి. :
మే.:      మళ్లీ ఏమొచ్చిందిరా చెయ్యి పైకి ఎత్తావ్?
జం.లి.:    మీరేమో అవ్వు పాలు ఇస్తుంది అన్నారండి.
మే.:      అవును ! అందుకు సందేహమా.
జం.లి. :   మా బావ ఆవు పాలు ఇవ్వదు అన్నాడండి.
మే.:      ఆహా ! తమరెప్పుడు పాలు తాగాలేదాండి ?
జం.లి.:    తాగానండి .
మే.:      మరి అవి ఎక్కడనుంచి వచ్చాయి?ఆవు ఇస్తేనే
            గదా?
జం.లి. :   కాదటండి !మనం పితుక్కోవాలి గాని, వాటంతట
             అవే  ఇవ్వవటండి.
.........................
అదండీ జంబులింగం సంగతి.