పేజీలు

15, డిసెంబర్ 2009, మంగళవారం

జేమ్స్ బాండ్

ఒకసారి విమాన ప్రయాణంలో జేమ్స్ బాండ్ , ఒక తెలుగు వ్యక్తి పక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. వారి మధ్య సంభాషణ ఇలా వుంది.


తె.వ్య.:- హలో,  మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్?

జే.బా:- మై నేమ్ ఈస్ బాండ్.. జేమ్స్ బాండ్.

జే.బా:- మరి మీ పేరు?

తె.వ్య:- నా పేరు సాయి......

  వెంకట సాయి.......

  శివ వెంకట సాయి.......

  లక్ష్మి నారాయణ శివ వెంకట సాయి.......

  శ్రీనివాసుల లక్ష్మి నారాయణ శివ వెంకట సాయి........

  రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మి నారాయణ శివ వెంకట సాయి........

  సీతారామాన్జనేయుల  రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మి నారాయణ శివ వెంకట సాయి........

  బులుసుపల్లి సీతారామాన్జనేయుల రాజశేఖర శ్రీనివాసుల లక్ష్మి నారాయణ శివ వెంకట సాయి!......

జే.బా: !!!!!!!

చెవిలో పువ్వు

మీకెవరైనా గొప్పలు చెప్పే వాళ్ళు ఎదురైతే ఈ కింది పదాలు వాడచ్చు......
అబ్బా ..
అవునా!.....
అలాగా!...
అలాగలాగే...
బాగుంది...
చెప్పు...
చాల్లే...
చా...'
ఏమిటీ.....
ఇంకా...
ఐనట్టే... 
అయిపోయిందా ....
కథలోద్దు...
తగ్గించు....
వెటకారాలా.....
వార్నీ....
అంతలేదు....
అంత అవసరమా....
చాలా చూసాం......
చాలా మంచిది....
ఏంటి బాబు....
ఎక్కువ వద్దు....
ఎలా కనబడుతున్నాను!...
ఇంకేం దొరకలేదా?...
కాస్త ఎక్కువైంది....
మనదేవూరు....
నీ ఇష్టం.....
సరే కాని....
ఇంకో మాట చెప్పు.....
అది కాదు గాని.....
కాస్త ఎక్కువయ్యయా, సరే ఆపేద్దాం.

3, డిసెంబర్ 2009, గురువారం

క్యూరియాసిటి

ఈ మధ్య చదివిన హాస్య కథ ఒకటి మీ కోసం........

      కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కొందరికి ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది కాని, కొందరు  అనవసర విషయాలను గురించి అన్వేషణ ప్రారంభించి చేతులు కాల్చుకుంటారు. అందుకు నిదర్శనం....
   
       ఒక మిత్రుడు  విమాన ప్రయాణ నిమిత్తం విమానాశ్రయానికి వెళ్ళాడు. బోర్డింగ్ పాసు  తీసుకున్నాడు. విమానం బయలు దేరడానికి ఇంకా గంట టైం ఉంది. ఏం చేయాలి? చుట్టూ చూశాడు. తెలిసినవాళ్ళు ఎవరు  కనబడలేదు. అటు - ఇటు పచార్లు ప్రారంభించాడు. దూరంగా - "వేయింగ్ మిషన్ యంత్రం " కనబడింది. వెళ్ళాడు....బరువు చూసుకుందామని పర్సు లోంచి కాయిన్ తీసాడు. మిషన్లో వేసాడు. కార్డు ఒకటి బయటకు వచ్చింది. బరువు చూసుకున్నాడు. సరిగానే ఉంది. రెండో పక్క ఏదో రాసి ఉంది ఇంగ్లీషులో.

"యూ ఆర్ గల్లిబుల్! బి కేర్ఫుల్ ఇన్ చూసింగ్ యువర్ ఫ్రెండ్స్"  అని ఉంది.

నిజమే ! తాను నమ్మి - ఇద్దరు ముగ్గురు స్నేహితులకు అప్పులిచ్చి మోసపోయాడు!

ఇంతలో మరొకాయన వచ్చి బరువు చూసుకున్నాడు. కార్డు వచ్చింది.

ఏమని రాసి ఉందండి? అడిగాడు ఆయన్ని.

అతను కార్డు ఇచ్చాడు. మన మిత్రుడు  దాన్ని చదివాడు.

"యూ ఆర్  వెరీ కైండ్ హార్టెడ్ ! యూ కెనాట్ సీ  అదర్స్ సఫరింగ్స్!" అని ఉంది.

నిజమేనా అడిగాడు. అవునన్నాడు అతను.

"మీరు ఏమి చేస్తుంటారు?"

"నేను ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను."

"ఓహో! అలాగా. "

మొదటాయనకి ఒక సందేహం వచ్చింది. ఇంకొకరిని పిలిచాడు. అతన్ని  బరువు చూసుకోమన్నాడు. అతను కాయిన్ లేదు అన్నాడు.

"నేనిస్తాను" అంటూ కాయిన్ ఇచ్చాడు. ఆయనకు వచ్చిన కార్డు మీద వేరే సందేశం ఉంది.

ఈ మిషన్లో కొన్ని వందల సందేశాలు ఉంటాయి కదా!

రిపీట్ కాకుండా ఇన్ని సందేశాలు రావటము ఎలా సాధ్యం!

     మరొక ప్రయాణికుడికి కాయిన్ ఇచ్చి వేయించాడు. సందేశం వేరుగా ఉంది. కుతూహలం కొద్ది ఇలా ఒక పది, పదిహేను మందికి కాయిన్లు ఇచ్చి  పరీక్షించాడు. సందేశాలు వేరుగా ఉన్నాయి.
      
       తన దగ్గర ఉన్న కాయిన్లు అయిపోయినాయి. క్యాంటినుకు వెళ్ళాడు. ఉరికేనే కాయిన్స్ ఇవ్వమంటే వారు ఇవ్వరు, కాబట్టి, కప్పు కాఫీ తాగాడు! చిల్లరగా కాయిన్స్ తీసుకున్నాడు. అవి వేరేవాళ్ళకు ఇచ్చి వేయింగ్ మిషన్లో  వేయించి సందేశాలు చూశాడు.
     
        ఆ కాయిన్స్ కుడా అయిపోగానే బుక్ షాపుకు వెళ్లి న్యూసు పేపరు కొన్నాడు. మళ్లీ కాయిన్స్ తీసుకున్నాడు. ఇలా 40, 50 మందికి కాయిన్స్ ఇచ్చి మెషిన్లో వేయించాడు. ఆశ్చర్యం! ఏ ఒక్కరికి సందేశం రిపీట్ కాలేదు. ఎలా సాధ్యం! ఆశ్చర్య పోయాడు!
       
        వెంటనే ఫ్లాష్ లాగా ఐడియా వచ్చింది. "మళ్లీ తనే కాయిన్ వేస్తే అదే సందేశం వస్తుందా! లేదా దానికి భిన్నంగా 
  "యూ ఆర్ వెరీ వెరీ ఇంటలిజెంట్. నో బడీ కాన్ చీట్ యూ!" అని వస్తుందా.
  
   చూద్దాం! అని మరో కాయిన్ వేసాడు. కార్డు వచ్చింది! చదివాడు!
 
  "ది ప్లెయిన్ బై విచ్ యూ వాంటెడ్ టు ట్రావెల్ హాజ్  ఆల్రెడీ లెఫ్ట్!"

   "ఆ!"

   ఆ లేదు , ఊ లేదు అది వెళ్లి అరగంటవుతుంది అని చెప్పారు.

   "!!"