గెంతు రాజా గెంతు !
పది అయ్యింది.
రాత్రి పది అయ్యింది.
ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది.
ఇంట్లొకి వచ్చి షూ విప్పాను.
బెల్ట్ తీసాను.
అమ్మ, సుప్రజ నా వైపు భయంగా చూశారు.
బెల్ట్ చూసి భయపడ్డారేమోనని బెల్ట్ దాచేసాను.

ఇంకా అలానే చూస్తున్నారు. అప్పుడు గమనించాను.
టివిలో ఏదో ప్రొగ్రాం వస్తుంది. ఎవడో మూతి దగ్గర పెట్టుకోవలసిన మైక్ ని ముక్కు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు.

“అంతా బాగుంది కాని, నువ్వు కాళ్ళతో వెసిన స్టెప్స్ అన్నీ చేత్తొ వేస్తే ఇంకా బాగుండేది.”
“లేదు మాస్టర్, నేను వెయ్యలేను. ఎందుకంటే.. ఎందుకంటే.. నా చిటికిన వేలి గోరు విరిగింది.” అని ఏడ్చింది స్టేజ్ మీద కుక్కకి తిక్క తగిలితే చించిన గుడ్డలతో కుట్టిన గౌను వెసుకున్న చిన్నది.

స్లో మోషన్ లో ప్రేక్షకుల మొహాలు ఒకసారి చూపించారు.
కొందరు ఏడుస్తున్నట్లున్నారు.
కొందరు ఏడుస్తున్నట్లున్నారు.
“బంక మాస్టార్ మన శిల్పకి ఎన్ని మార్కులు ఇచ్చారో తెలుసుకునేముందు మనగెంతు రాజా గెంతు లో ఒక చిన్న (30నిమిషాలు) బ్రేక్ ” అని తన చేతులు గాలిలొ లేపి ఊపి కెమేరాని గుద్దింది.
ఆ గుద్దుకి నేను ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
ఇప్పుడు తెలిసింది వాళ్ళ ఎక్స్ ప్రెషన్ కి గల కారణం. అది భయం కాదు. ఆందోళన.
(డైలీ సీరియల్స్ చూసి చూసి ఎప్పుడు ఏ ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో మర్చిపోయారు.)

హడావిడిగా వంట గదిలోకి వెళ్ళారు నాకు డిన్నర్ రెడీ చెయ్యడానికి.
సొఫాలో కూర్చుంటూ టివి రిమోట్ అందుకుని చానల్స్ మార్చసాగాను.

ఒక న్యూస్ చానల్
“పంది ఇంకా లింగం చుట్టూ తిరుగుతునే వుంది. మరిన్ని వివరాలకు అక్కడే కుక్కలాగా కాచుకుని వున్న రామక్రిష్ట్నని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు రామక్రిష్ట్న.”

ఇంకో చానల్
“నువ్వు ఎంచుకొన్న రాగం ఏంటి…నువ్వు పాడుతున్న తాళం ఏంటి..” ఎవడో బోడి గుండు వెదవ 3ఏళ్ళ పాపని బెదిరిస్తున్నాడు.

“మీ టివి వాల్యుం కొంచం తగ్గిచండి.”
“మీ టివి వాల్యుం కొంచం తగ్గిచండి.”
ఒక చానల్లో
ఒక కుటుంబం మొత్తం దేనిగురించో మాట్లాడుకుంటుంది. జాగ్రత్తగా గమనించాను. అందులో ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవుడు ఒకేలాగ ఉన్నారు.
ఒకేలాగా ఎంటి.. ఒక్కడే… మన ‘కమలాకర్ ‘ (పేరు మార్చడం జరిగింది). ఏదో చానల్లో కొడితే ఈ చానల్లో పడ్డాడు.

మరో చానల్లో
“కావ్య ప్రదీప్ ని కలుసుకుంటుందా? సుశాంత్ మొబైల్ బిల్లు ఎంతవచ్చింది? తులసమ్మ ఏమి పీకుతుంది? అని తెలుసుకోవాలంటే ‘ దిక్కుమాలిన బ్రతుకులు ‘ చూడండి”

ఇంకో చానల్లో
“…ఇదంతా తెలియని రామయ్య యదావిదిగా ఇంటికి వచ్చాడు. ఇంటిముందున్న కుక్కని కాలుతొ తన్నాడు. అప్పటివరకు నిద్రపోతున్నట్లు నటిస్తున్న కుక్క అతని పిక్క పట్టుకొంది.”
స్క్రీన్ మీద ‘ కల్పిత పాత్రలతో’ (కుక్కతో సహా) అని వుంది.

“…దానమ్మకి కోపం వచ్చింది. ఇప్పటివరకు దాన్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు. నీ ఎంకమ్మ, అనవసరంగా దాని పిల్లను తెచ్చావ్.”
డైనోసార్ జీప్ ని పడేసి తొక్కుతుంది. ‘జురాసిక్ పార్క్’ తెలుగులో వస్తుంది అనుకుంటా…

మరో చానల్ మార్చాను.
నా డిన్నర్ రెడీ అయ్యింది.
వాళ్ళెందుకో కొంచం హడవిడిగా కనిపించారు. దేని కోసమో వెతుకుతున్నట్లున్నారు.
సుప్రజ కళ్ళు నా చేతిలొ ఉన్న రిమోట్ మీద పడ్డాయి. మొహంలో ఆందొళన కనిపించిది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆనందం అని తర్వాత తెలిసింది.)

నేను రిమోట్ ఇచ్చేసాను.
“వెల్కం బ్యాక్ టూ గెంతు రాజా గెంతు.” టివిలో ప్రొగ్రాం మొదలైంది.
నేను డిన్నర్ చేస్తున్నంత సేపూ ఏవో అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించాయి. అప్పుడప్పుడు కొన్ని ‘బీప్’లు కూడా వినిపించాయి.
డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళ వేపు చూసాను. వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించింది.
(ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్ధం ఆందోళన అని అప్పుడే అర్ధమయ్యింది.)

(అయిపోయింది.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి